4 గంటల్లో బెంగళూరు to చైన్నైగుండె ప్రయాణం

చెన్నై, ప్రతినిధి : బెంగళూరు రహదారిపై ఓ అంబులెన్స్ స్పీడుగా వెళుతోంది. దానికి అడ్డుగా ఇతర వాహనాలు రాకుండా ట్రాఫిక్ పోలీసుల చర్యలు..అందరిలో ఉత్కంఠ..ఎందుకంటే ఆ అంబులెన్స్ లో ఓ లేత గుండె ఉంది. చెన్నైలో ఉన్న ఓ చిన్నారికి ఆ గుండెను అమర్చనున్నారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు..చర్యలను అధికారులు తీసుకున్నారు. చివరకు గుండె ఆపరేషన్ విజయవంతం కావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

బెంగళూరు పోలీసుల గ్రీన్ కారిడార్..
బెంగళూరు మణిపాల్ ఆస్పత్రిలో రెండేళ్ల బాలుడు బ్రెయిన్ డెడ్ పరిస్థితిలోకి వెళ్లాడు. మరోవైపు చెన్నైలో రెండేళ్ల చిన్నారి గుండె మార్పిడి కోసం ఎదురుచూస్తోంది. బ్రెయిన్‌ డెడ్‌ బాలుడి అవయవాలను దానం చేయడానికి తల్లిదండ్రులు అంగీకరించారు. అంతే… బెంగళూరు పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటుచేసి హుటాహుటిన మణిపాల్ ఆస్పత్రి నుంచి విమానాశ్రయానికి గుండెను తరలించారు. హెచ్ఏఎల్ విమానాశ్రయం నుంచి విమానంలో చెన్నై విమానాశ్రయానికి చేరింది. అప్పటికే సిద్ధంగా ఉన్న ఫోర్టిన్ ఆసుపత్రి అంబులెన్స్ కు చెన్నై పోలీసులు సహకరించడంతో సకాలంలో గుండె ఆసుపత్రికి చేరింది.

నాలుగు గంటల్లో చెన్నైకి చేరిన గుండె..
బెంగుళూరు నుంచి కేవలం నాలుగు గంటల్లోనే గుండెను చెన్నైకి చేర్చారు. వైద్యులు శస్త్ర చికిత్స చేసి రెండేళ్ల బాలుడికి సక్సెస్‌ఫుల్‌గా గుండెను అమర్చారు. బ్రెయిన్‌ డెడ్‌ అయిన చిన్నారి తల్లిదండ్రులు ఐటి ఉద్యోగులు. బాలుడి కాలేయాన్ని అవసరం ఉన్న మరో చిన్నారికి దానం చేశారు. ఇటు బెంగుళూరులోను..అటు చెన్నైలోనూ పోలీసులు ట్రాఫిక్‌ నియంత్రించడం వల్లే ఇది సాధ్యమైంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.