
మరాఠీలో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన ‘సైరత్’ మూవీ సంచలనాలు కొనసాగిస్తూనే ఉంది. కేవలం 4కోట్ల బడ్జెట్ తో యువ ప్రేమ జంటతో ప్రేమ కథను తెరకెక్కించిన మరాఠీ ధర్శకుడు నాగరాజ్ మంజులే ప్రతిభకు మరాఠీలతో పాటు దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చిపడుతున్నాయి.
ఈ సినిమా కేవలం 4 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. ఈ సందర్భంగా ఇప్పటికే 84కోట్ల రూపాయలను మరాఠీ, ఇతర బాలీవుడ్ లో వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఈ సినిమా అంచనాలను మించి ఆడుతోంది. దీంతో ఈ సినిమా 100 కోట్ల మార్కు దాటేలా కనపడుతోంది. కాగా ఈ సినిమా రిమేక్ రైట్స్ ను తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ రేట్లు కళ్లు చెదిరిపోయే రేట్లకు అమ్ముడుపోయాయట.. దీంతో త్వరలోనే ఈ సినిమా తెలుగు, తమిళంలో రిమేక్ కానుంది.
సైరట్ మూవీ ట్రైలర్ ను పైన చూడొచ్చు..