31 నుండి నందమూరి కళ్యాణ్ రామ్ ‘పటాస్’దిగ్విజయ యాత్ర!

నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయం చేస్తూ నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించి నిర్మించిన ‘పటాస్’జనవరి 23న విడుదలై వరల్డ్ వైడ్ గా అద్భుతమైన కలెక్షన్స్ తో ప్రదర్శింపబడుతూ 2015 ఫస్ట్ బ్లాక్ బస్టర్డ్ గా అఖండ ప్రజాదరణ పొందుతున్న విషయం తెలిసిందే. ఈ సంద్భంగా పదేళ్ళ తర్వాత ‘అతనొక్కడే’ని మించిన సంచలన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, నందమూరి అభిమానులకు కృతజ్ఞతలు తెలపడానికి ఈనెల 31నుండి నందమూరి కళ్యాణ్ రామ్ తన యూనిట్ తో కలిసి దిగ్విజయ యాత్ర చేస్తున్నారు. జనవరి 31 మార్నింగ్ షోకి నెల్లూరులో, మ్యాట్నీ టైమ్ కి ఒంగోలులో సాయంత్రం 4.30కి చిలకలూరి పేటలో సాయంత్రం 6 గంటలకు గుంటూరులో, రాత్రి 9గంటలకు తెనాలిలో ప్రేక్షకుల్ని ‘పటాస్’ధియేటర్స్ లో కలుసుకుంటారు. 31 రాత్రి విజయవాడలో బస చేసి 1వ తేది ఉదయం విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకొని.. అమ్మవారి ఆశీస్సులందుకొని మార్నింగ్ షో టైమ్ కి గుడివాడ, మ్యాట్నీ టైమ్ కి మచిలీపట్నం ధియేటర్స్ లో ప్రేక్షకుల్ని కలుసుకుంటారు. 1వ తేదీ సాయంత్రం విజయవాడ సిద్ధార్ధ కాలేజ్ గ్రౌండ్స్ లో ప్రేక్షకులు, అభిమానుల సమక్షంలో జరిగే ‘పటాస్’విజయోత్సవ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తో పాటు ‘పటాస్’చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొంటారు. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ సెకండ్ వీక్ లో మరిన్ని ధియేటర్స్ ని పెంచడం ఈ చిత్రం సాధించిన ఘనవిజయానికి నిదర్శనం. సాయికుమార్, అశుతోష్ రాణా, ఎమ్మెస్ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణమురళి, ఝాన్సీ, కాశీవిశ్వనాధ్, పృధ్వీ, ప్రభాస్ శ్రీను, పవిత్ర లోకేష్, ప్రవీణ్, రఘు, ప్రాచి, షకలక శంకర్, తదితరులు మిగతా పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సర్వేష్ మురారి, సంగీతం: సాయి కార్తీక్, పాటలు: భువనచంద్ర, శ్రీమణి, తైదల బాపు, సుబ్బరాయశర్మ, డాన్స్: రాజసుందరం, జానీ మాస్టర్, ఎడిటింగ్: తమ్మిరాజు, ఆర్ట్స్: ఎం.కిరణ్ కుమార్, ఫైట్స్: పటాస్ వెంకట్, రచనా సహకారం: ఎస్.క్ర్రిష్ణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటీవ్: ఎస్.జె.ఫణికుమార్, చీఫ్-కోడైరెక్టర్: సత్యం, కో-డైరెక్టర్స్: ఎస్.క్రిష్ణ, మహేష్ ఆలంశెట్టి, నిర్మాత: నందమూరి కళ్యాణ్ రామ్, కధ-మాటలు-స్క్ర్రీన్ ప్లే- దర్శకత్వం: అనిల్ రావిపూడి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *