31న బాహుబలి ఆడియో రిలీజ్ వాయిదా

prabhas-and-rajamouli

హైదరాబాద్ : అనివార్య కారణాల వల్ల బాహుబలి సినిమా ఆడియో వేడుక వాయిదా వేస్తున్నట్లు చిత్ర దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్ లు తెలిపారు. దర్శకులు రాజమౌళి నిర్మాతలతో కలిసి హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో విలేకరులతో మాట్లాడారు. భారీ ప్రెస్ మీట్ పెట్టి సినిమా విశేషాలను ప్రకటించాలనుకున్నామని, అయితే ఊహించని రీతిలో అభిమానులు తరలిరానున్నారని వారికి అసౌకర్యం కలిగించకూడదనే ఆ ప్రెస్ మీట్ ను రద్దు చేసినట్లు చెప్పారు.

భద్రతాపరమైన కారణాలతో ఆడియో ఫంక్షన్ కు పోలీసులు నియంత్రణలు విధించారని దానివల్ల కొంతమంది అలజడి పాల్పడే ప్రమాదం ఉందని.. అందుకే ప్రభాస్ ను ఫ్యాన్స్ దగ్గరకు తీసుకెళ్లడమో, ఫ్యాన్స్ నే ప్రభాస్ దగ్గరకు తీసుకెళ్లడమో త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆడియోను జూన్ మొదటి వారానికి వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *