300మందిని లోబరుకున్నాడు..

హైదరాబాద్ : హైదరాబాద్ లో ఓ మాజీ ఉద్యోగి దారుణాలు వెలుగుచూశాయి.. ఎఫ్ సీ ఐలో పనిచేసి అనుచిత ప్రవర్తనతో సస్పెండ్ అయిన కలకండ మధు అనే వ్యక్తి అమ్మాయిలను లోబరుచుకోవడమే ధ్యేయంగా పక్కా స్కెచ్ వేసి దాదాపు 300 విద్యార్థులను అంతా ఇంటర్ లోపు వారిపైనే బెదిరించి అత్యాచారం చేశాడు..

హైదరాబాద్ లోని పలు చోట్ల ఇళ్లు అద్దెకు తీసుకొని ఓ ఇంటర్ నెట్ సెంటర్ ద్వారా పది, ఇంటర్ విద్యార్థుల హాల్ టికెట్ నంబర్ల ద్వారా అమ్మాయిల పేర్లు, ఫోన్ నంబర్లు తీసుకున్నారు. అనంతరం వారితో తాను ఒక ఎడ్యుకేషనల్ కన్సల్టంట్ అని పరిచయం పెంచుకొని ఇంటికి రప్పించుకునేవాడు. ఎదురుతిరిగిన వారిని వదిలేసి.. అట్రాక్ట్ అయిన వారిని ఉచ్చులోకి లాగేవాడు..

ఇలా ఒకరి కాదు ఇద్దరు కాదు దాదాపు 300మంది విద్యార్థులను అతడు మోసం చేసి అత్యాచారం చేశారు. ఓ విద్యార్థిని ధైర్యం చేసి పోలీసులకు చెప్పడం దారుణం వెలుగుచూసింది.. పోలీసులు దుండగుడి ఇంటిని తనిఖీ చేయగా వందల సంఖ్యలో కండోమ్ లు , గర్భనిరోదక మాత్రలు, 19 సెల్ ఫోన్లు, 30 సిమ్ కార్డులు దొరికాయి.. అమ్మాయిలతో రాసలీలలు చేసిన వీడియోలు లభించాయి.. ల్యాప్ టాప్, కంప్యూటర్లు స్వాధీనంచేసుకున్నారు.

కాగా మధు తన కలాపాలకు అడ్డు వస్తుందని పెళ్లి కూడా చేసుకోకపోవడం గమనార్హం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *