30మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ ను వ్యతిరేకిస్తున్నారు

errabelli1

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీలో సీఎం కేసీఆర్ ను 30 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారని టీటీడీపీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. శనివారం ఆయన హైదరాబాద్ లోని టీడీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్సీని గెలవనీయకుండా కేసీఆర్ కుట్ర పన్నుతున్నాడని.. కానీ ఆయన ఆటలు సాగవన్నారు. కేసీఆర్ ఆ పార్టీలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. టీడీపీ ఖాళీ చేయడం ఆయన వల్ల కాదని అన్నారు. అసమ్మతి సెగలతో టీఆర్ఎస్ ప్రభుత్వమే కూలిపోతుందన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *