Breaking News

3 వ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించిన బుర్రా వెంకటేశం

3 వ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించిన బుర్రా వెంకటేశం

సికింద్రాబాద్ లోని పెరేడ్ మైదానంలో జనవరి13 నుండి15 వరకు జరిగే 3 వ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్, మొదటి అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్ నిర్వహణ ఏర్పాట్లు ను తెలంగాణ టూరిజం , సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం పర్యవేక్షించారు. నిర్వహణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచ తెలుగు మహాసభల విజయాన్ని స్పూర్తి గా తీసుకొని కైట్, స్వీట్ ఫెస్టివల్ ను  విజయవంతం చేయాలని సూచించారు.  అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న కైట్ ఫెస్టివల్ లో 10 దేశాల నుంచి 40 మంది ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్  పాల్గొంటున్నారని, అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్ లో 14 దేశాల తో పాటు 25 రాష్ట్రాల నుంచి 1000 రకాల స్వీట్ల ప్రదర్శన ను నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 13 నుంచి జరుగుతున్న ఫెస్టివల్ కు జంట నగరాల ప్రజల తో పాటు వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి రోజుకు లక్ష మంది పైగా ప్రజలు హాజరుకానున్నారు, వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వ కుండా ఏర్పాట్లు చేయాలని కోరారు పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం. హైదరాబాద్ నగరం లో వివిధ రాష్ట్రాల, దేశాల ప్రజలు ఎన్నో ఏళ్ళు గా జీవిస్తున్నారని వారి సంస్కృతి, సంప్రదాయాల ప్రజలు తయారు చేస్తున్న స్వీట్లు ఒకే వేదికపై తీసుకరావటం దేశంలోనే ఇదే మొదటి సారిగా నిలువబోతున్నారు. ఈ ఫెస్టివల్ కు ప్రజలందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ కైట్,  స్వీట్ ఫెస్టివల్ లో అందరూ ఆహ్వానితులే ,  ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం కమిషనర్ సునీత మహేష్ భగవత్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ఫెస్టివల్ నిర్వహణ
కమిటీ సభ్యులు బెంజిమెన్ లతో పాటు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *