Breaking News

సత్తన్న అక్షరాయుధం సభ సక్సెస్

IMG-20180506-WA0232

సీనియర్ జర్నలిస్టు మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ రచించిన అక్షర ఆయుధం పుస్తక పరిచయ సభ ఆదివారం కరీంనగర్ జిల్లా పరిషత్ హాల్ లో జరిగింది. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బోయినపల్లి వినోద్కుమార్ పుస్తక పరిచయ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్.సత్యనారాయణ ఉత్తమ జర్నలిస్టు , గొప్ప త్యాగశీలి అని ఎంపీ వినోద్కుమార్ కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావానికి ముందు ప్రతి విషయాన్ని కెసిఆర్ ఆర్ సత్యనారాయణతో చర్చించే వారని వినోద్ కుమార్ గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షులు తాడూరు కర్ణాకర్ ఈ సభకు అధ్యక్షత వహించారు. కవి, సినీ విమర్శకులు ,సెన్సార్ బోర్డు సభ్యులు వారాల ఆనంద్ ఈ  పుస్తకాన్ని పరిచయం చేసారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నలిమెల భాస్కర్, అఖిలభారత రచయితల సంఘం అధ్యక్షులు జూకంటి జగన్నాథం ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. ప్రముఖ వ్యాఖ్యాత మాడిశెట్టి గోపాల్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆన్లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఐలు రమేష్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లా కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్ ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు balmuri విజయసింహ రావు ,జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎలగందుల రవీందర్ ,ఆన్ లైన్ మీడియా కార్యదర్శి ప్రభు దాస్ ,కళ్యాణం శ్రీనివాస్, తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ చైర్మన్ కృపాదానం, కూకట్ల తిరుపతి, అన్నవరం దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *