
నోట్ల రద్దుపై ఇప్పటి వరకు గళమెత్తిన విపక్షాలు.. ఇక రోడ్డెక్కుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేయబోతున్నాయి. అందులో భాగంగా ఈ నెల 28వ తేదీ ( సోమవారం ) భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి మెగా అపోజిషన్స్. పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. దేశంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. అయినా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆరోపించారు విపక్ష నేతలు. దేశంలోని 13 పార్టీలు ఈ బంద్ కు సపోర్ట్ చేస్తున్నాయి. భారత్ బంద్ కు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తోంది. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ నిరసనలు ఉంటాయని ప్రకటించాయి పార్టీలు. లోక్ సభలో విపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రధాని మోడీ మౌనంగా ఉండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, జనతాదళ్, BSP, డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీలు భారత్ బంద్ కు మద్దతిచ్చాయి