ఫిబ్రవరి 28న పైడి జైరాజ్ డాక్యుమెంటరీ విడుదల, చిత్ర ప్రదర్శన

భారతీయ సినిమా రంగం లో 70 సంవత్సరాల పాటు హీరోగా కారెక్టర్ నటుడిగా వెలుగొందిన కరీంనగర్ ముద్దుబిడ్డ పైడి జైరాజ్ జీవిత ప్రస్థానం పైన కరీంనగర్ ఫిల్మ్ సొసైటి కార్యదర్శి పొన్నం రవిచంద్ర సుపద క్రియేషన్స్ పతాకంపై  రూపొందించిన డాక్యుమెంటరీ  విడుదల, చిత్ర ప్రదర్శన ఈ నెల 28 శనివారం రోజున సాయంత్రం 6 గంటలకు ఏర్పాటు చేసీనట్టు ఫిల్మ్ భవన్ లో యేర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కరీంనగర్ ఫిల్మ్ సొసైటి అధ్యక్ష కార్యదర్శులు  వరాలమహేశ్, పొన్నం రవించంద్ర, సలహాదారు వారాల ఆనంద్ తెలిపారు.

దాదాసాహేబ్ ఫాల్కె అవార్డ్ ను 1980లోనే అందుకున్న పైడి జైరాజ్ జీవిత విశేషాల తో రూపొందిన ఈ చిత్రంలో జైరాజ్ నటించిన సినిమాల విశేషాల తో పాటు జైరాజ్ పైన ప్రముఖ దర్శకులు శ్యామ్ బెనెగల్, బి.నర్సింగ రావు, రాజా మురాద్, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్, సినీ విమర్శకుడు వారాల ఆనంద్ , రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణలు తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. జైరాజ్ నటించిన హతీంతాయి మొదలు అనేక సినిమాల క్లిప్పింగ్స్ తో వివరణాత్మకంగా రూపొందిన ఈ చిత్రమ్ లో జైరాజ్ ప్రతిభ పాటవాలు ఆవిష్కృతమయ్యాయి. కాగా శనివారం రోజున  ఫిల్మ్ భవన్ లో ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ పి.రామ్ మోహన్ రావు విడుదల చేయనుండగా ఈ  కార్యక్రమంలోముఖ్య అతిథి గా దర్శకుడు బి.నర్సింగ్ రావు, గౌరవ అతిథులుగా కరీంనగర్ ఏం.ఎల్.సి. నారదాసు లక్ష్మణ్ రావు, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొంటారు. ఈ సభకు సినీ విమర్శకుడు వారాల ఆనంద్ అధ్యక్షత వహించనుండగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లె రవికుమార్, సీనియర్ జర్నలిస్ట్ పి.రామ్ మోహన్ నాయుడు, చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటి కొ ఆర్డినేటర్ ఎం.సాయిప్రసాద్, లోకసత్తా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ తో పాటు, డాక్యుమెంటరీ దర్శకులు చేతన్, సినిమాటోగ్రాఫర్ తిరుపతి, ఎడిటర్ ఉదయ్ తదితరులు పాల్గొననున్నారని తెలిపారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ,కరీంనగర్ ఫిల్మ్ సొసైటి, సహకారంతో యేర్పాటు ఈ కార్యక్రమములో  కరీంనగర్ జిల్లాకు చెందిన కళాకారులు,సాహితీవేత్తలు,సినీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. విలేఖరుల సమావేశంలో  క పి సో  సబ్యుడు లక్ష్మి గౌతమ్, సుపద క్రియేషన్స్ సబ్యులు పి. శేఖర్, నార్ల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

paidi jai raj     paidi jai raj 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *