28నుంచి బ్యాంకులకు వరుసగా సెలవులు

banking-ss-27-08-13

మార్చి 28 నుంచి బ్యాంకులకు వరుసగా సెలవులు రానున్నాయి. ఈ నెలాఖరుకు ఏదైనా బ్యాంకు పని ఉంటే తొందరగా చేసేసుకోండి.. మార్చి 28 నుంచి ఏప్రిల్ 6 వరకు మధ్య ఏకంగా ఐదు రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. మార్చి 28న శ్రీరామనవమి, 29న ఆదివారం, ఆ తర్వాత 30,31 తేదీల్లో బ్యాంకులు పనిచేసినా ఫైనాన్సియర్ ఇయర్ ముగింపు సందర్భంగా అకౌంట్ల పరిశీలన తప్పితే బ్యాంకు లావాదేవీలు జరగవు.. దీంతో ఖాతాదారులకు సెలవే.. తిరిగి ఏప్రిల్ 1న కూడా వార్షిక అకౌంట్ల పరిశీలన కొనసాగుతుంది. ఆ రోజు కూడా బ్యాంకులు పనిచేయవు. తిరిగి ఏప్రిల్ 3న గుడ్ ప్రైడే రాబోతోంది ఆరోజు సెలవే.. తర్వాత 4న బ్యాంకులు సగం రోజు మాత్రమే పనిచేస్తాయి. ఇక 5వ తేది ఆదివారం బ్యాంకులకు మళ్లీ సెలవు. అంటే పదిరోజుల్లో సగం సెలవు దినాలకే సరిపోతాయి. దీంతో నిత్యం బ్యాంకు లతో లావాదేవీలు సాగించే వ్యాపారస్తులు ఇప్పటినుంచే ఆందోళన చెందుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *