Breaking News

27 కొత్త జిల్లాలు, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల

disticts

17 కొత్త జిల్లాలతో కలిపి మొత్తం 27 జిల్లాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మొత్తం 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లుగా విభజన చేయనున్నట్టు ముసాయిదాలో పేర్కొన్నారు. ఈనెల 23 నుంచి అన్ని జిల్లాల్లో ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అందుబాటులోకి వస్తుంది. రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ సచివాలయం వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలూ, స్థానిక సంస్థల్లో ప్రకటనను నోటీస్‌ బోర్డులపై ప్రదర్శిస్తారు. నెల రోజుల లోపు ప్రజలు తమ వినతులను, అభ్యంతరాలను జిల్లా కలెక్టర్‌ కార్యాలయాలు, హైదరాబాద్‌ నాంపల్లిలోని భూపరిపాలన కార్యాలయంలో లిఖితపూర్వకంగా అందజేయాల్సి ఉంటుంది. కొత్తగా 17 జిల్లాలను అందులో 9 జిల్లాలకు విడివిడిగా నోటిఫికేషన్ విడుదల చేశారు. మార్గదర్శకాల కోసం జీవో 194ను విడుదల చేశారు. ముసాయిదా నోటీఫికేషన్ కోసం WWW.GOIR.TELANGANA.GOV.IN లో చూడొచ్చు..

కొత్త జిల్లాలు: రాంజీగోండు నిర్మల్‌, కొమురం భీం, కొత్తగూడెం, యాదాద్రి, సూర్యాపేట, నాగర్‌ కర్నూలు, వనపర్తి, హన్మకొండ, ఆచార్య జయశంకర్‌, భూపాలపల్లి, సిద్ధిపేట, సంగారెడ్డి, కామారెడ్డి, పెద్దపల్లి, జగిత్యాల, మల్కాజ్‌గిరి, శంషాబాద్‌, మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, హైదరాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్‌, నిజామాబాద్‌.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *