
ఈ 27 నుండి 8వ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు…
#సజావుగా సాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలి..స్పీకర్ మధుసూదన చారి,
# పోలీసులు అప్రమత్తంగా ఉండాలి …చైర్మన్ స్వామి గౌడ్
# తెలంగాణ శాసనసభ ఎనిమిదవ సమావేశాలు సజావుగా జరిగేందుకు తగిన చర్యలు తీసుకోవలసిందిగా శాసనమండలి చైర్మన్ మరియు శాసనసభ స్పీకర్ లు పొలీస్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.
ఈ నెల 27 నుండి ఎనిమిదవ శాసనసభ సమావేశాలు జరుగనున్నందున స్పీకర్ మధుసూదనచారి అద్యక్షతన శాసనమండలి చైర్మన్ స్వామీగౌడ్ ఉప సభాపతి పద్మా దేవేందర్ రెడ్డి,డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ,శాసనమండలి విప్ పాతూరి సుధాకర్ రెడ్డి ,శాసనసభ సెక్రటరీ నర్శింహాచార్యులతో కలిసి సభలు శాంతియుతంగా జరిగేందుకు తీసుకోవలసిన చర్యల పై సమీక్షా సమావేశం నిర్వహించారు.సభలు జరుగుతున్నసమయంలో పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని ,బయటినుండి వచ్చే వారిని నిబంధనల మేరకు ఐడెంటిటి కార్డ్ లు ఉంటేనే శాసనసభ లోనికి అనుమతించాలన్నారు. శాసనసభ సభ ఆవరణ లో సీసీటీవీ ల ఏర్పాటు మరియు చుట్టూ పటిష్ట మైన భద్రతా చర్యలు తీసుకోవాలని ,సభ నిర్వహణ కు ఆటంకం కలుగకండ జాగ్రత్త లు తీసుకోవాలన్నారు. ఎటువంటి బ్యానర్ లు కాని ఇతర సామగ్రిని కాని లోనికి అనుమతించరాదని పలు ఆదేశాలు జారీ చేసారు . అదే సమయంలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయుటకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
అంతకు ముందు సీఎస్ తో సమావేశం కాగా, వివిధ శాఖలకు సంబంధించిన సభ్యులు అడిగే ప్రశ్నలకు జవాబులు వేగవంతంగా ,అర్ధవంతంగా రావడానికి చర్యలు తీసుకోవాలని చైర్మన్, స్పీకర్ లు సి.ఎస్. ఎస్పీ సింగ్ కు సూచించారు.
సమావేశంలో హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది ,హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి,సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య, ఎస్పీఎఫ్ డీజీ తేజ్దీప్ కౌర్, అసెంబ్లీ చీఫ్ మార్షల్ టి. కరుణాకర్ ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.