26న క‌రీంన‌గ‌ర్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం

జ‌నాభాలో 20 శాతం వేరికోస్ వెయిన్స్ బాధితులే :

-ఎవిస్ హాస్పిట‌ల్స్ ఎండీ డాక్ట‌ర్ రాజా వి.కొప్పాల‌

క‌రీంన‌గ‌ర్ :- నిరంతరం ఉరుకులు పరుగులతో జీవనయాత్ర సాగిస్తున్న ప్రజానీకంలో కాళ్లలో సిరలు అనే నరాలు వాచిపోయే వ్యాధి (వెరికోస్ వెయిన్స్ )విస్తరిస్తోంది. ఈ వ్యాధి బాధితుల సంఖ్య ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా నిలబడి వృత్తిధర్మాన్ని నిర్వర్తించే పోలీసులు, ఉపాధ్యాయులు, ఐటి ప్రొఫెషనల్స్, షాప్కీపర్స్ సెక్యూరిటీ సిబ్బందితో పాటు మహిళల్లో ఈ వ్యాధితో బాధపడేవారి సంఖ్య ఆందోళనకరంగా మారుతోంది. ప్రస్తుత జనాభాలో ఇటువంటి వ్యాధిగ్రస్తులు 20 శాతం వరకు ఉన్నారంటే ఆశ్చర్యం కలగకతప్పదు. నిలబడి పనిచేసేవారేగాక గర్భిణీలు, ఊబకాయం, అధికబరువు కలిగిన వారిలో ఈ వ్యాధి కనిపిస్తుంది. కాళ్లలో చర్మం కింద ఉండే సూపర్ ఫిషయల్ సిరల్లో ఈ వ్యాధి కనిపిస్తుంది. ప్రధానంగా మోకాలి నుంచి తొడలు ద్వారా గజ్జల వరకు ఉండేదాన్ని లాంగ్ సఫెనస్ వీన్స్ అని, కాలు వెనుక గల మడమ నుంచి మోకాలు కీలు వరకు గల భాగంలో సిరలు వాచిపోవడాన్ని షార్ట్ సఫెనస్ వీన్స్ వ్యాధిగా గుర్తిస్తారు. కాళ్లలో నొప్పి,బరువు, వాపు, కండరాలు బిగుతుగా మారడం, రంగుమారి, దురద, పుండ్లు పడడం వంటి లక్షణాలు కనిపించి తీవ్రంగా బాధిస్తాయి. నడవలేని పరిస్థితులు ఏర్పడతాయి.
దీనికి సంబంధించి దక్షణాది రాష్ట్రాలలోనే అత్యధిక ఆపరేషన్లు చేసే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబ‌ర్‌ 1లో గల ఎవిస్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ రాజా వి.కొప్పాల.. మాట్లాడుతూ విదేశాలలో ముఖ్యంగా అమెరికా, లండన్ వంటి దేశాలలో నూతన ఆపరేషన్ ప్రక్రియలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నూతన విధానం వల్ల సూదిని వైర్ ద్వారా పంపి వెయిన్స్ను కరిగించి వేయవచ్చునన్నారు. కేవలం ఒక్కరోజులోనే ఈ ఆపరేషన్ పూర్తయి రోగి అదే రోజు నడుచుకుంటూ ఇంటికి వెళ్లవచ్చునని వివరించారు. ఆపరేషన్కు 3-4 గంటల ముందు ఎటువంటి ఆహారం తీసుకోరాదని, ఆపరేషన్ పూర్తయిన తర్వాత వారం పదిరోజుల్లో ఒకసారి, నెలరోజుల తర్వాత మరోసారి చెకప్ చేయించుకోవాల్సిఉంటుందని వివరించారు. ఇది వంశపారంపర్యంగానూ వస్తుందని, గర్భిణీలలో తొలుత కనిపించినా తర్వాత తగ్గుతుందన్నారు. వయసుతో పాటు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని డాక్టర్ రాజా చెప్పారు. నిరంతరం నడక, జాగింగ్, ఈత, సైక్లింగ్ వంటి వ్యాయామాల వల్ల ఈ వ్యాధి రాదని తెలిపారు. ఒకవేళ నరాలు వాచి బాధ పెడితే కాళ్లు ఎత్తులో పెట్టుకుని పనిచేయాలని, పడుకునేటప్పుడు కాళ్లు కింద ఎత్తుపెట్టుకోవాలని డాక్టర్ రాజా చెప్పారు. రోగులు సర్జరీకి 3 గంటల ముందుగా నీరు తాగవచ్చునని, ఉబ్బసరోగులు ఇన్హేలర్ వాడకం, మధుమేహ రోగులు ఇన్సులిన్ వాడినప్పటికీ ఈ సర్జరీలకు ఆటంకం ఉండదని ఆయన వివరించారు. ఇంగ్లండ్లో ఇటీవల 327 మందికి ఆపరేషన్లు నిర్వహించగా 94 శాతం పూర్తిస్ధాయిలో సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఓ సర్వేలో తేలింది. ది రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జరీ- ఇంగ్లండ్ వారి అంచనా ప్రకారం ఇటువంటి చికిత్సా విధానం మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని డాక్టర్ రాజా తెలిపారు.డే కేర్ సెంటర్ గా సేవలందిస్తున్న తమ ఆసుపత్రిలో కేవలం ప్యాకేజీ మేరకు ఆపరేషన్లు జరుగుతాయని, ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. సేవా వృత్తిలో ఉన్నవారికి ఉచిత స్క్రీనింగ్ టెస్టుల సౌకర్యాన్ని అందిస్తున్నట్లు డాక్టర్ రాజా తెలిపారు.
తమ ఎవిస్ ఆసుపత్రి చేపట్టే సామాజిక కార్యక్రమాల్లో భాగంగా వివిధ రకాలుగా వైద్యసేవలు అందిస్తున్నామని డాక్టర్ రాజా తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పిలుపుమేరకు నెలకు ఒక రోజు ఉచిత సేవలు బదులు నెలకు ఓ ప్రాంతంలో ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించామని డాక్టర్ రాజా చెప్పారు. దీనిలో భాగంగా విజయవాడ కేంద్రంగా 2016 మే నెల 28వ తేదీ శనివారం గవర్నర్ పేటలో ని ఐఎంఎ హాలులో ఉచిత వైద్యశిబిరం నిర్వహించామని ఆయన తెలిపారు. అదేవిధంగా 2016 జూలై 16న కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాలో లయిన్స్ క్లబ్, వాసవి క్లబ్ సంయుక్త నిర్వహణలో వేరికోస్ వెయిన్స్, ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ, ఆర్ధో విభాగాలలో వైద్య శిబిరం నిర్వహించామని వివరించారు. 2016 ఆగస్టు 21న విశాఖలో జిటిపిఎల్-వాజీ విశాఖ తో కలిసి వేరికోస్. ప్లాస్టిక్ సర్జరీ విభాగాలలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించామని ఆయన తెలిపారు. 2016 సెప్టెంబ‌ర్ 25న క‌ర్నూలులో ల‌యిన్స్ క్ల‌బ్‌తో క‌లిసి ఉచిత వైద్య శిబిరం నిర్వ‌హించామ‌ని వివ‌రించారు అదేరోజున కోల్‌క‌తాలో ఎవిస్ ఆసుప‌త్రికి చెందిన ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ గౌతమ్ దెందుకూరి ప్ర‌త్యేక వైద్య శిబిరం నిర్వ‌హించార‌ని తెలిపారు. 2016 అక్టోబర్ 23న రాజమహేంద్రవరంలోనూ, నవంబర్ 26న నెల్లూరులోనూ, డిసెంబర్ 4న ప్రకాశం జిల్లా పరుచూరులోనూ ఈ శిబిరాలు నిర్వహించామని ఆయన తెలిపారు. డిసెంబర్ 25న తెలంగాణలోని హైదరాబాద్లో రెడ్ క్రాస్ సోసైటీ హైదరాబాద్ జిల్లా ఛైర్మన్ ఎం. భీంరెడ్డి క్యాంపు ఛైర్మన్‌గా ఈ శిబిరాన్ని నిర్వహించామని వివరించారు. . ఇంతవరకు దాదాపు 3500 మందికి ఈ ఉచిత వైద్య శిబిరాలలో సేవలు అందించామని రాజా తెలిపారు. ఈ ఏడాది కూడా ఈ శిబిరాలను కొనసాగిస్తున్నామ‌ని , కార్పొరేట్ సేవలలో భాగంగా ప్రజలకు తమ వంతు సేవలను అందిస్తున్నామని డాక్ట‌ర్ రాజా వివరించారు. 2017 జ‌న‌వ‌రి 29న క‌డ‌ప‌లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామ‌ని ఆయ‌న తెలిపారు. తాజాగా ఈ నెల 26న టీయూడ‌బ్ల్యూజే సౌజ‌న్యంతో ప్రెస్‌క్ల‌బ్ భ‌వ‌న్‌లో ఈ ఉచిత మెగా వైద్య శిబిరం జ‌రుగుతుంద‌ని ఆయ‌న తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *