Breaking News

25 మంది బృందంతో సీఎం కేసీఆర్ చైనా టూర్

KCR_AFP1

సాధారణంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు విదేశీ టూర్లు అంటే పడదు.. ఆయన ప్లేసులో కేటీఆర్ లేదా ఇతర మంత్రులను పంపిస్తుంటారు.. కానీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి పిలుపు రాగానే వీలు చూసుకునే కేసీఆర్ వెళుతున్నారు. ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు కేసీఆర్ చైనా ఎకనామిక్ ఫోరంలో పాల్గొంటారు..

కాగా సీఎంతో పాటు భారీ గా 25 మంది ఆయన వెంట వెళుతున్నారు.వ్యాపరవేత్తలు, రాజకీయ నేతలు, అధికారులు వెళుతున్నారు. కాగా సీఎం చైనాలో తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీని పథకాలను, పెట్టుబడి అవకాశాలను వివరించేందుకు చైనా టూరును ఉపయోగించుకునేందుకు ఈ ప్లాన్ చేశారని.. అందుకే భారీ యంత్రాంగంతో వెళుతున్నారని సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *