
హైదరాబాద్, ప్రతినిధి :ఇన్నాళ్లు ‘విశాలంధ్ర’గా తెలుగు పాఠకులను అలరించిన పత్రిక నేడు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ‘మన తెలంగాణ’ పేరుతో రాబోతోంది. ఎడిటర్ కే.శ్రీనివాస్ రెడ్డి గారి సారథ్యంలో మన తెలంగాణ పత్రిక, దాంతో పాటు మన తెలంగాణ వెబ్ సైట్ ను ఈనెల 25న రవీంధ్రభారతిలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు.
ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ కు విశాలంధ్ర, తెలంగాణకు మన తెలంగాణ పేరుతో పత్రిక వస్తుంది.