
విజయ్ కే. కుమార్.. తొలి చిత్రం మనంతోనే అందరిచేత ప్రశంసలు పొందాడు. కింగ్ నాగార్జున , మొత్తం ఫ్యామిలీని తెరపై చూపించి ఫ్లాష్ బ్యాక్ కథతో దుమ్ముదులిపాడు. మనం తో హిట్ కొట్టిన ఈ దర్శకుడు మరో అడ్వంచర్ కథతో ప్రిన్స్ మహేశ్ బాబును సంప్రదించాడట.. మహేశ్ సినిమా చేసేందుకు తయారు చేసిన కథనే ‘24‘ కథ.. కానీ మహేశ్ మొదటి పార్ట్ బాగుంది.. రెండో పార్ట్ నచ్చలేదని విజయ్ కుమార్ ను పంపించేశాడట..
దీంతో విజయ్ నేరుగా తమిళ హీరో సూర్య వద్దకు వెళ్లి కథను వినిపించగా ఆయన కథకు మెస్మరైజ్ అయ్యి చేయడానికి ఒప్పుకున్నాడు. మరో విశేషం ఏంటంటే కథ నచ్చి సూర్యనే దీనికి నిర్మాతగా వ్యవహరిస్తుండడం గమనార్హం..
సో మహేశ్ బాబు వద్దన్న కథను సూర్య చేసి ప్రస్తుతం విడుదల చేస్తున్నాడు ఆ మూవీయే 24. ఈ సినిమాలో దాదాపు 3 గెటప్ లతో సూర్య నట విశ్వరూపమే చూపాడు. త్వరగా విడుదల కానున్న ఈ మూవీ హిట్ కొడితే మహేశ్ ఓ మంచి సినిమాను వదులుకున్నాడనే టాక్ వినిపిస్తుంది. చూద్దాం.. ఎవరి డిసిషన్ కరెక్టో రాంగో..