24న టీఆర్ఎస్ లో చేరుతున్నా..:మంచిరెడ్డి

హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా నియోజకవర్గ నాయకులతో సమాలోచనలు జరుపుతున్న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం టీడీపీ ఎమ్మెల్యే , రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. నాయకులు, కార్యకర్తలతో మాట్లాడిన అనంతరం నియోజకవర్గ అభివృద్ది కోసం ఖచ్చితంగా టీఆర్ఎస్ లో ఈనెల 24న ప్లీనరీ వేదికపై చేరుతున్నట్టు ప్రకటించారు.

అంతకుముందు టీడీపీ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి సచివాలయంలో సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. భవిష్యత్ భరోస, నియోజకవర్గానికి నిధులు ఇస్తానని హామీ ఇవ్వడంతో ఆయన టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *