230 కోట్ల మొక్కలు నాటుట లక్ష్యం : రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న

సిద్దిపేట జిల్లా ములుగులో సీడ్ బాంబింగ్ ద్వారా నూతన ప్రక్రియతో సీడ్ బాల్స్

విత్తనాలు తయారీపై శిక్షణ కార్యక్రమం

ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో 230 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్ణయించినట్లు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు బుధవారం ములుగు మండలం అటవీ పరిశోధన కేంద్రంలో సీడ్ బాల్ ద్వారా విత్తనాలు నాటే నూతన ప్రక్రియపై 31 జిల్లాల DFO లు, ఫీల్డ్ ఆఫీసర్లు, కన్జర్వేటర్లకు నిర్వహించిన శిక్షణ శిభిరంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర్ర ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు మానస పుత్రిక తెలంగాణకు హరిత హారం కార్యక్రమమును గత రెండు విడతలుగా విజయవంతం చెసినట్లు మూడో విడత కూడా విజయ వంతం చేయాలనీ మంత్రి కోరారు ఈ సంవత్సరం రెండు వందల ముప్పై కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు, ఇందులో అడవులు క్షీణించిన అటవీ ప్రాంతంలో వంద కోట్ల మొక్కలు నాటుటకు ప్రణాళిక ప్రకారం చెర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు, సీడ్ బాంబింగ్ నూతన విధానం ద్వార జీవామృతం కలిపిన ఎర్ర మట్టిలో విత్తనం పెట్టి బాల్ లాగా తయారు చేసి ఆరాబెట్టిన తర్వాత గట్టి పడుతుందని ,ఈ సీడ్ బాల్ విధానం ద్వారా విత్తనం ఏ విధంగా తయారు చేస్తారో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అమర నారాయణ కర్ణాటకలో బాగా ప్రచారం కల్పిస్తున్నారన్నారు. అదే విధంగా నవ చైతన్య ట్రస్ట్ NGO శ్రీనివాస్ రాజ్ కూడా ఈ ప్రక్రియపై అవగాహనా కలిపిస్తున్నారన్నారు. ఈ రోజు 31 జిల్లాల అటవీ శాఖాధికారులకు ఈ శిక్షణ నివ్వడం సంతోషకరమని దీనిని రానున్న రోజులలో వినియోగించుకునేందుకు కృషి చేస్తమన్నారు.

ముఖ్యమంత్రి కార్యాలయ OSD ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ సీడ్ బాల్ విత్తన తయారీ ఫై గ్రామాలలో స్వయం సహాయక మహిళా సంఘాలు, జైళ్ల లోని ఖైదీలకు అవగాహన కలిగించి విత్తనాలను తయారు చేసి వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు

తొలుత రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అమర్ నారాయణ జీవామృతం కల్పిన ఎర్ర మట్టిలో విత్తనం వేసి బాల్ లాగా తయారు చేసి చూపించారు ఈ బాల్ ను ఆరబెట్టినా తరువాత గట్టిపడుతుందని అన్నారు ఈ విధానంలో అవసరమైన మొక్కల విత్తనాలను తయారు చేసుకొనిన అడవులలో వర్షానికి ముందు విత్తనాలు చల్లితే విత్తనం జెర్మినేషన్ జరిగి ఈ మొక్కలు పెరుగుతాయని అన్నారు ఈ విధానంలో తయారు చేసిన సీడ్ బాల్ విత్తనాలను పశువులు, మేకలు , గొర్రెలు తినవని తెలిపారు కర్ణాటక లో NGO ల సహకారంతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు . అనంతరం మంత్రి జోగు రామన్న ములుగులో నిర్మాణంలో ఉన్న వ్యవసాయ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు

ఈ శిక్షణ కార్యక్రమంలో అడిషనల్ ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్.ఎం. డోబ్రీయాల మెదక్ జిల్లా చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎ.కె.సిన్హా ,సిద్దిపేట DFO శ్రీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.