
ఈనెల 23నుంచి తెలంగాణ శాసనసభా సమావేశాలు మొదలుకాబోతున్నాయి.. ఈసారి ప్రతిపక్షాలు పకడ్బందీగా టీఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి సమాయత్తమవుతున్నాయి.. ప్రధానంగా రాష్ట్రంలోని రైతుల ఆత్మహత్యలపై , ఇసుక అవినీతిపై తదితర సమస్యలపై నిలదీసేందుకు సమాయత్తమవుతున్నాయి..
కాగా టీఆర్ఎస్ కూడా ప్రతిపక్షాలను సమర్థంగా ఎదుర్కోనేందుకు సిద్ధమైంది. రైతు ఆత్మహత్యలు కాంగ్రెస్, టీడీపీల పాపమే నని నిలదీసేందుకు సమాయత్తమవుతోంది..