Breaking News

హలో జర్నలిస్ట్.. చలో కలెక్టరేట్ కరపత్రం విడుదల

tuwj.jpg2

జర్నలిస్టుల సమస్యలపై టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్ పేర్కొన్నారు. కరీంనగర్ ప్రెస్ భవన్ లో విలేకరుల సమావేశంలో సీనియర్ జర్నలిస్టులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈనెల 22న తెలంగాణలోని 10 జిల్లాల్లో కలెక్టరేట్ల ముందు ధర్నా, వంటావార్పు, నిరసనలు చేయనున్నట్లు నగునూరి శేఖర్ తెలిపారు. తెలంగాణ ఏర్పడి రెండున్నరేళ్లు గడిచినా ఇప్పటివరకు తెలంగాణ జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాకపోవడంపై మండిపడ్డారు.. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాలు, ఇతర పెండింగ్ సమస్యలు తీర్చకపోవడంపై మండిపడ్డారు.

జర్నలిస్టుల డిమాండ్లు ఇవే..

tuwj-brocher2f

ఈ కార్యక్రమంలో టీయూడబ్య్లూజే జిల్లా అద్యక్షుడు తాడూరి కరుణాకర్, తెలంగాణ ఆన్ లైన్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అయిలు రమేశ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బల్మూరి విజయసింహారావు, నేషనల్ కౌన్సిల్ మెంబర్ ఎలగందుల రవీందర్, జిల్లా కార్యదర్వి గాండ్ల శ్రీనివాస్, స్టేట్ కౌన్సిల్ మెంబర్లు డి. జగన్మోహన్, ప్రభుదాస్, ఎలక్ట్రానికి మీడియా ప్రతినిధులు శరత్ రావు, విజయేందర్ రెడ్డి, ఏబీెఎన్ వెంకట్, ఎన్పీ ప్రవీణ్,ఫొటోగ్రాఫర్ల ప్రతినిధులు వై.రాధాకృష్ణ,  షుకూర్,  యూనియన్ నాయకులు ఈద మధుకర్ రెడ్డి, పవన్ కుమార్, రవీందర్ రెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *