Breaking News

21 ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ కానున్నాయి

mlc

హైదరాబాద్, ప్రతినిధి : మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలంగాణ లో మరోసారి ఎన్నికల కోలాహాలానికి టైం దగ్గరపడింది. రెండు నెలల వ్యవధిలో మొత్తం 21 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో తెలంగాణలోని అన్నిజిల్లాల్లో ఎన్నికల వాతావరణం ఊపందుకుంది. టీఆర్ఎస్ , కాంగ్రెస్ లలో నాయకులు అధిష్టానం దగ్గర పైరవీలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు.

వచ్చే మార్చి 29వ తేదితో తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అందులో ఆరు ఎమ్మెల్యే కోటా, పట్టభద్రుల నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్సీ స్థానాలు రెండు కాగా, ఒకటి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానం. మరో వైపు మే 1న ఏడు స్థానిక సంస్థలైన మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మెదక్ స్థానాల ఎన్నికల కోసం ఇదే నెలలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

మొత్తానికి వచ్చే మూడు నెలల్లోనే 21 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఆయా పార్టీల నాయకులు తమకు ఎమ్మెల్సీ స్థానాల అవకాశం కోసం విస్తృతంగా లాబీయింగ్ చేస్తున్నారు. మరో అధిష్టానాలు కూడా పనిచేసిన వారికే టికెట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు..

సీఎం కేసీఆర్ ఇటీవల సమావేశాల్లో పార్టీ శ్రేణులకు ఇదే విషయం చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఎగిసపడ్డ ఉద్యమకారులకు ఖచ్చితంగా పదవులు ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆ పార్టీలో పోటీ తీవ్రమైంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *