Breaking News

21మంది ఈజిప్ట్ క్రైస్తవులను చంపిన ఐసిస్

లిబియా :  మరోఘోరాన్ని చేశారు ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదులు.. ఈజిప్ట్ దేశానికి చెందిన 21 మంది క్రైస్తవులను అమానుషంగా తలలు నరికి చంపేశారు.

లిబియా రాజధాని ట్రిపోలి సమీపంలోని ఒక బీచ్ వద్ద నారింజ రంగు దుస్తులతో .. చేతులకు సంకెళ్లు వేసి ఉన్న బందీలను నల్లని ముసుగులు ధరించిన ఉగ్రవాదులు కిరాతకంగా హత్య చేస్తున్నట్లుగా ఉన్న 5 నిమిషాల వీడియోను ఐఎస్ ఐఎస్ సంస్థ ఆన్ లైన్ లో విడుదల చేసింది.

ఆ వీడియోలోనే ఉగ్రవాదులు హెచ్చరికల చేశారు. ‘ వెనకాల ఉన్న సముద్రంలోనే షేక్ ఒసామా బిన్ లాడెన్ మృతదేహం ఉంది. ఇందులో మీ రక్తం కలుపుతాం’ అని ఆ వీడియో చివరలో ఓ ఉగ్రవాది వ్యాఖ్యానించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *