
వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలు, వైసీపీ అధినేత జగన్ సోదరి వైఎస్ షర్మిల ఓదార్పుయాత్ర వరంగల్, కరీంనగర్ జిల్లాలో ఈనెల 21 నుంచి ప్రారంభం కానుంది..21,22 తేదీల్లో వరంగల్ జిల్లాలో మొదలుకానున్న ఈ పర్యటన అక్కడ వైఎస్ మరణంతో చనిపోయిన కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం భూపాలపల్లి మీదుగా కరీంనగర్ జిల్లా మహముత్తారం మండలం బొర్ల గూడెం గ్రామంలోకి చేరుకుంటుంది.. అక్కడ బాధితులను పరామర్శించి .. రాత్రికి కాటారంలో బస చేస్తారు. అనంతరం మంథని, పెద్దపల్లి, ధర్మపురి, చొప్పదండి నియోజకవర్గాల గుండా ఓదార్పు యాత్ర సాగుతుంది..
కరీంనగర్ జిల్లాలో వైఎస్ మరణంతో చనిపోయిన 30 కుటుంబాల్లో తొలి విడతగా 23వ తేదీ నుంచి 13 కుటుంబాలను షర్మిల పరామర్శించి వారికి సానుభూతి తెలుపుతారు. రెండో విడతలో మరోసారి షర్మిల కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తారు.