2022 నాటికి తెలంగాణ రైతు ఆదాయం రెట్టింపు: మంత్రి హరీష్ రావు

రైతులకు మార్కెటింగ్ సదుపాయాలపై

నాలుగు రాష్ట్రాల్లో అధ్యయనం.

మంత్రి హరీష్ రావుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్.

మద్దతుధర, ఇతర అంశాలపై సమీక్ష.

పంట పెట్టుబడి పథకంతో పాటు రైతులకు అధిక ప్రయోజనం కలిగేలా ప్రణాళిక రచన.

.ఎకరానికి సీజన్ కు 4 వేల రూపాయల చొప్పున తెలంగాణ ప్రభుత్వం అమలుచేయనున్న పంట పెట్టుబడి పథకం, పెరగనున్న సాగునీటి వసతి, పలు సంక్షేమ కార్యక్రమాలు, మార్కెటింగ్ రంగంలో తీసుకు వచ్చిన సంస్కరణలతో తెలంగాణ రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు అవుతుందని మార్కెటింగ్ మంత్రి హరీష్ రావు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.రైతులకు మరిన్ని ప్రయోజనాలు లభించేందుకు సమగ్ర కార్యాచరణ
ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. మధ్యప్రదేశ్,మహారాష్ట్ర,హర్యానా,కర్నాటకలలో అమలవుతున్న వ్యవసాయ మార్కెటింగ్ కార్యకలాపాలపై అధ్యయనం చేసి వచ్చిన మార్కెటింగ్ ఉన్నతాధికారుల బృందం మంగళవారం రాత్రి మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయా రాష్ట్రాల్లో రైతులు వేసే పంటలు,దిగుబడులు, నిల్వసదుపాయాలూ,మార్కెట్ యార్డుల పరిస్థితి,మద్దతు ధర, రైతులకు చెల్లింపులు, మార్కెట్ స్థిరీకరణ నిధి వంటి పెక్కు అంశాలపై తమ అధ్యయనాన్ని ఈ బృందం మంత్రికి వివరించింది.మహారాష్ట్రలో గత ముప్ఫై సంవత్సరాలుగా కాటన్ మార్కెటింగ్ కార్పోరేషన్ పనిచేస్తున్నట్టు మార్కెటింగ్ అధికారులు మంత్రికి తెలిపారు. అలాగే ఆ రాష్ట్ర మార్కెటింగ్ సంస్థ కందులు కొనుగోలు చేసి, పప్పులు గా మార్చి మధ్యాహ్న భోజన పథకానికి, హాస్టళ్లకు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు.మధ్యప్రదేశ్ లో “భావంతర్ భుగ్తాన్ ” పేరిట అమలు చేస్తున్న కార్యక్రమాన్ని మంత్రికి వివరించారు. ఈ పథకం కింద కనీస మద్దతు ధర కన్నా మార్కెట్లో రైతులకు తక్కువ ధర పలికిన సందర్భాల్లో మిగతా డబ్బును నష్టపరిహారం కింద ఆ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెల్లిస్తున్నదని మార్కెటింగ్ అధికారులు తెలియజేశారు.ఎం.ఎస్.పి.తో పాటు తమ రాష్ట్ర రైతుల కోసం “ సరాసరిధర”ను మధ్యప్రదేశ్ అమలు  చేస్తున్నదని చెప్పారు .ధరలస్థిరీకరణ కింద 4000 కోట్లను మధ్యప్రదేశ్ సమకూర్చిందని మార్కెటింగ్ అధికారులు చెప్పారు.హర్యానాలో ఉల్లి, టమాటా,క్యాలిఫ్లవర్ వంటి కూరగాయలను పండించే ముందే ఆయా పంటలు, వాటి దిగుబడి అంచనాతో ప్రాధమిక ధరను ప్రభుత్వం ఖరారు చేస్తున్నదని చెప్పారు.కర్ణాటకలో దాదాపు పదేళ్లుగా ధరల స్థిరీకరణ నిధి అమలు చేస్తున్నట్టు మార్కెటింగ్ అధికారులు మంత్రికి చెప్పారు. మద్దతు ధర రాని పక్షంలో ప్రభుత్వం వివిధ పద్ధతుల్లో సహకరిస్తున్నదని,ఆర్ధిక సహకారం అందిస్తున్నదనితెలిపారు.ఈ నాలుగు రాష్ట్రాల అధ్యయన నివేదికను సి.ఎం.కెసిఆర్ కు సమర్పించిన తర్వాత తగిన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి హరీశ్ రావుతెలియజేశారు. వ్యవసాయ పనులు ప్రారంభించే నాటి నుంచి పంట దిగుబడి మార్కెట్ కు వచ్చేంతవరకు, ఆతర్వాతవాటి కొనుగోలుకు తీసుకుంటున్న చర్యలు, రైతులకు తప్పని సరిగా మద్దతు ధర లభించేలా జరుపుతున్న కృషి లో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాల కన్నా అగ్రగామిగా ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.తాజా కూరగాయలతో నడుపుతున్న “ మన కూరగాయలు” అవుట్లేట్ ల సంఖ్య 100 కు పెంచాలని మంత్రి ఆదేశించారు.ఈ సమావేశంలో మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీ బాయి,జాయింట్ డైరెక్టర్ లక్ష్మణుడు తదితరులు పాల్గొన్నారు.

లక్షా యాభై వేల మెట్రిక్ టన్నుల కందులు కొనాలి. కేంద్రానికితెలంగాణ ప్రభుత్వంమరో లేఖ. కందులకొనుగోళ్ల అక్రమాలపై కొరడా. జనగామ మార్కెట్ కార్యదర్శి పై చర్యలు. కందుల రీ సైక్లింగ్ ను ఉపేక్షించేది లేదు. ప్రత్యెక బృందాలతో నిఘా పెట్టాలని కలెక్టర్లకు ఆదేశం. రాష్ట్రం లో ఈ సీజన్ లో కందుల పంట దిగుబడి 2 లక్షల 84 వేల మెట్రిక్ టన్నులు వస్తున్న నేపథ్యంలో లక్షా యాభయ్ వేల మెట్రిక్ టన్నులను సేకరించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రప్రభుత్వాన్ని రాష్ట్ర మార్కెటింగ్ మంత్రి హరీష్ రావు కోరారు.మొదట 33,500 మెట్రిక్ టన్నుల కందుల కొనుగోలు కు కేంద్రం అంగీకరించింది.మంత్రి హరీష్ రావు నిరంతర సమీక్షలు, పర్యవేక్షణవల్ల కేంద్ర ప్రభుత్వం 53, 600 మెట్రిక్ టన్నుల సేకరణకు ఒప్పుకున్నది.కానీ కందుల పంట దిగుబడి అనూహ్యంగా ఉండడంతో కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని మంత్రి హరీష్ రావు భావించారు. ఆయన ఆదేశాలతో ఎం.పి.జితేందర్ రెడ్డి, మార్కెటింగ్శాఖప్రిన్సిపల్ కార్యదర్శిపార్ధసారధిధిల్లీ లో కేంద్ర వ్యవసాయ మంత్రి రాదా మోహన్ ను,ఆ శాఖ ఉన్నతాధికారులను కలిసి విజ్ఞపతి చేయడంతో ఎట్టకేలకు 1,13, 600 మెట్రిక్ టన్నుల కందుల సేకరణకు కేంద్ర ప్రభుత్వంఅంగీకరిస్తున్నట్టూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. అయితే రాష్ట్రంలో కందుల దిగుబడి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈ పరిమితిని సడలించాలని 1,50,000 మెట్రిక్ టన్నుల సేకరణకు ఆదేశించాలని హరేష్ రావు కోరారు. ఇప్పటివరకుతెలంగాణాలో 83,650 మెట్రిక్ టన్నుల
కందులను సేకరించారు.మార్క్ ఫెడ్ కు చెందిన 66, హాకా కు చెందిన 47 కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ కొనుగోళ్లు జరిగాయి. మొత్తం కందుల కొనుగోళ్ల విలువ 455 కోట్లు.కందులకొనుగోళ్ల అనంతరం చేల్లిమ్పులలో ఎలాంటి జాప్యం తగదని మంత్రి హరీష్ రావు అన్నారు.కందులు కొనుగోలు చేసిన వెంటనే మార్క్ ఫెడ్, హాకా సంస్థల అధికారులు కందులను గోడౌన్లకు తరలించి “ నాఫెడ్” సంస్థకు స్వాధీన పరచాలనిఆదేశించారు.కందుల కొనుగోళ్లలో అక్రమాలు, అవకతవకలు జరిగితే సహించబోనని మంత్రి హెచ్చరించారు.కందుల రీ సైక్లింగ్ జరగకుండా కఠినచర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. రైతుల ముసుగులో కొందరు ట్రేడర్లు,దళారులు ఎక్కువ ధరకు అమ్ముతున్నందున అటువంటి కార్యకాలాపను అరికట్టాలని కోరారు. ప్రత్యెక బృందాలు ఏర్పాటు చేసి కందుల కొనుగోలు కేంద్రాలపై నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్లను మంత్రి హరీష్ రావు ఆదేశించారు.కంది రైతులకు మద్దతు ధర తప్పనిసరిగా లభించాలని అన్నారు. రైతులకుబకాయిలను వెంటనే చెల్లించాలని ఆదేశించారు.జనగామ, భువనగిరిలలోకందులక్రయ,విక్రయాల్లో అవకతవకలు జరిగినందున జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి పై వెంటనే చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ డైరెక్టర్ ను మంత్రి హరీష్ రావు ఆదేశించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *