
హైదరాబాద్,ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ ను పేదరికం, ఆర్థిక అసమానతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు అన్నారు. ఐఐఎంకు పునాది రాయి అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలు లేనిది పట్ణణాలు, దేశం లేదని చెప్పారు. ఎపిని ఆర్థిక అసమానతలు లేని రాష్ట్రాన్ని… చూడాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 2022 నాటికి భారత దేశంలోనే…నవ్యాంధ్రను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు లక్ష్యాన్ని పెట్టుకున్నామని చంద్రబాబు అన్నారు. అందరూ కలిసి పని చేస్తే… అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా చేరుకుంటామని సీఎం ధీమా వ్యక్తం చేశారు.
2050 సంవత్సరంలో ఎపిని ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉంచుతామని పేర్కొన్నారు. తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్ టిఆర్ ను ప్రజలు గుర్తుకు పెట్టుకుంటారన్నారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా 18కి.మీ పాదయాత్ర చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు.