
2020నాటికి ప్రపంచంలోని అందిరికీ ఇంటర్నెట్ అందించేందుకు ప్రఖ్యాత టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఫేస్ బుక్ వ్యవస్థాపకులు మార్క్ జుకెర్ బర్గ్ సిద్ధమయ్యారు. ఇంటర్నెట్ పై అమెరికాలో నిర్వహించిన ఓ సదస్సులో వీరు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ విస్తరించేందుకు అవసరమైన వనరుల కోసం తమ సంపదనంత ఖర్చు చేసేందుకు రెడీ అంటూ సంతకం చేశారు..
ఇంటర్నెట్ వినియోగం ద్వారా ప్రజలకు మరిన్ని అవకాశాలు పెరుగుతాయి. మెరుగైన జీవితం లభిస్తుంది.పేదరికం తగ్గుతుందని చెప్పారు. దీనికి వికీపీడియా సహవ్యవస్థాపకులు జిమ్మి వేల్స్ కూడా మద్దతు తెలిపారు. 2030నాటికి ప్రపంచవ్యాప్త ఇంటర్నెట్ లక్ష్యం చేరుకోవలన్నారు.