తాటి, ఈత చెట్లను ఎక్కే యంత్రాల కొనుగోలుకు ప్రతిపాదికలు సిద్దం చేయండి : మంత్రి పద్మారావు

2017-18 ఆర్ధిక సంవత్సర బడ్జెట్ రూపకల్పనకై ఎక్సైజ్ శాఖ

అధికారులతో మంత్రి పద్మారావు

2017-18 ఆర్ధిక సంవత్సర బడ్జెట్ రూపకల్పనకై ఎక్సైజ్ శాఖ అధికారులతో మంత్రి పద్మారావు ఆయన ఛాంబర్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశం సుమారు 3 గంటల పాటు జరిగింది. పలు అంశాల మీద సుదీర్ఘంగా చర్చ జరిగింది.. ముఖ్యంగా గుడుంబా తయారు చేసి మానివేసిన వారికి పునరావాసం క్రింద ఈ బడ్జెట్ లో అత్యధిక మొత్తం లో నిధులు కేటాయింపులు జరిపేలా, గీత కార్మికుల మరణాలు ఎక్కువైన నేపద్యం లో కేరళ రాష్ట్రం లో మాదిరి గా తాటి, ఈత చెట్లను సులభంగా ఎక్కే యంత్రాలను కొనుగోలు నిమిత్తం ప్రతిపాదికలు సిద్దం చేయాలని ఆదేశించారు. ఈ సంధర్భంగా మంత్రి మాట్లాడుతూ గతం లో చెప్పిన మాదిరిగా ఈ బడ్జెట్ సంవత్సరం లో 2 కోట్ల తాటి మరియు ఈత మొక్కలను నాటుతున్నాము దానికి కావలసిన నర్సరీ మరియు వాటి మెయింటెనెన్స్ మొదలగు వాటి కోసం నిధులు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నాము.. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆమోదం తెలప గానే వీటికి సంబందించిన బడ్జెట్ రూపకల్పన తుది దశకు వస్తుందని అన్నారు. ఈ బడ్జెట్ లో ఎక్సైజ్ స్టేషన్ల నిర్మాణాల కొరకు, వాటి మెయింటెనెన్స్ కొరకు, వాహనాలకు కూడా నిధులు కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రతిపాదికలు పంపాం అని మంత్రి అన్నారు.

ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ సెక్రెటరి సోమేశ్ కుమార్, కమిషనర్ చంద్రవదన్, అడిషనల్ కమిషనర్ రాజశేఖర్ రావు, OSD రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *