2017లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను అదుపు చేయగలిగాం : పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అధికారులు, సిబ్బందిలో సరియైన శిక్షణ, అవగాహన తో పాటుగా ప్రజల సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా శాంతిభద్రతల అంశంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ, నేరాలను నియంత్రణ చేయగలిగామని పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి వివరించారు.బుధవారం కరీంనగర్ కమిషనరేట్ లోని సమావేశ మందిరంలో 2017 సంవత్సరంకు సంబంధించి, కరీంనగర్ పోలీసులు శాంతిభద్రతల అంశంలో సాధించిన ప్రగతిపై ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా 2017 సంవత్సరంలో గత సంవత్సరం కంటే నేరాలను అదుపులోకి తీసుకురాగలిగామన్నారు.నేరాల శాతం చాలావరకు తగ్గిందన్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా, పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కల్పించామనీ, కమిషనరేట్ పరిధిలో ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థను మరింతగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు..
 తమ పోలీసు యంత్రాంగం అంకితభావంతో విధులు నిర్వర్తించారనడానికి  2017లో శాంతిభద్రతల్లో ప్రజలకు అండగా ఉండి, నేరాల శాతం గణనీయంగా తగ్గడమే నిదర్శనమని పోలీసు కమిషనర్ కమలాసన్ రెడ్డి తన పోలీసు టీమ్ వర్క్ ను మెచ్చుకున్నారు.
 పోలీసుల పనితనం వలన ఈ సంవత్సరం… ఆస్తుల చోరికి పాల్పడిన 206 మందిని అరెస్టు చేయడం జరిగిందన్నారు.వీరిలో మహారాష్ట్ర, తమిళనాడు కు చెందిన ముఠా సభ్యులతో పాటుగా  బీహార్ కు చెందిన నలుగురు నేరస్థులను పట్టుకున్నామన్నామనీ, 16.55 శాతం ఇందుకు సంబంధించిన నేరాలను తగ్గించగలిగామని ఆయన వివరించారు. అలాగే 30 మంది కరడుగట్టిన నేరస్థులను  గుర్తించి, వారిపై పి.డి చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.  అన్నివర్గాలకు సంబంధించిన ప్రధాన పండుగల ఉత్సవాలకు ప్రణాళికాబధ్దమైన బందోబస్తు మూలంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
సాంకేతిక పరంగా ఆధునాతన విధానాలతో ప్రజలకు మరింత చేరువవుతున్నామని వాటి గురించి పోలీసు కమిషనర్ కమలాసన్ రెడ్డి వివరించారు…సాంకేతిక పరిజ్ఞానం గురించి వివరిస్తూ….మూడు డ్రోన్ కెమెరాలతో బహిరంగ ప్రదేశాల్లో, మానేరు డ్యాంపైనా మద్యం సేవించేవారిని పట్టుకోవడం, అక్రమంగా నిలువచేసిన ఇసుక డంపులను గుర్తించి, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.జిపిఎస్ తో కూడిన *రాపిడ్ కాప్* ద్వారా పెట్రోలింగ్ వ్యవస్థ ను పటిష్టవంతం చేశామనీ, రాత్రిళ్లు 12 నుండి తెల్లవారు ఝాము 3-30 వరకు రోడ్లపై, వీధుల్లో తిరిగేవారిపై చర్యలు తీసుకోవడం జరిగిందనీ, ఇది మంచి ఫలితాలనిస్తుందని అన్ని వర్గాల వారు తమతో మాట్లాడుతున్నారన్నారు..
 
 
 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *