
హైదరాబాద్ , ప్రతినిధి : 2014 సంవత్సారానికి సంబంధించిన విద్యా సవరణ చట్టం బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించింది. బిల్లును శాసనసభలోకి ప్రవేశపెడుతూ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై స్పీకర్ ఓటింగ్ నిర్వహించి బిల్లును సభలోకి ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు.
దాంతో పాటు,.ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి సంబంధించిన సీఆర్డీఏ-2014 బిల్లును ఏపీ శాసనసభలోకి ప్రవేశపెడుతూ మంత్రి నారాయణ తీర్మానం చేశారు. దీనిపై స్పీకర్ మూజువాణి ఓటు నిర్వహించి బిల్లును సభలోకి ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఏపీ వైద్య విధానపరిషత్‌కు సంబంధించిన బిల్లు పేపర్లను స్పీకర్ టేబుల్‌పై ప్రవేశపెడుతూ తీర్మానం చేశారు. ఈ తర్వాత సభను 10 నిమిషాలపాటు టీ బ్రేక్ విరామం ప్రకటించారు.