
హ్యుండయ్ కార్ల కంపెనీకి 2014 కలిసొచ్చింది. కార్ల అమ్మకాల్లో హ్యుండయ్ రికార్డు కొట్టింది. 2014లో ఏ కంపెనీ అమ్మనన్ని కార్లను హ్యుండయ్ అమ్మింది. దాదాపు 4 లక్షల 10 వేలకు పైగా కార్లను అమ్మి అమ్మకాల్లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఎక్సెంట్, సాంటా, ఐ20 లాంటి కార్లు ఎక్కువ అమ్ముడుపోయాయి. హ్యుండయ్ కంపెనీ సీఈఓ బీ.ఎస్.సియో మాట్లాడుతూ, 2014 బిజినెస్ బాగుందని, అమ్మకాలు అంచనాలను దాటాయని చెప్పారు. దీన్నిబట్టి తమ కంపెనీకి మార్కెట్లో విశ్వసనీయత ఎంతుందో అర్థమవుతోందని చెప్పారు.