Breaking News

2200 కోట్ల ఖర్చుకు 22 ప్రాణాలు బలి..

stampede_2_2472635g

తెలంగాణలో 106 ఘాట్లకు దాదాపు 600 కోట్లను ప్రభుత్వం కేటాయించి ఏర్పాట్లు పూర్తిచేసింది. బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం లాంటి ఫేమస్ ఘాట్లు ఇక్కడ ఉన్నాయి. కాగా ఏపీ ప్రభుత్వం కేవలం 10లోపు ఘాట్లను ఏర్పాటు చేసింది. దానికి 2200 కోట్ల నిధులను కేటాయించి అభివృద్ధి పనులు చేసింది. రాజమండ్రి వద్ద గొప్ప పుష్కరాలంటూ ఊదరగగొట్టింది. 10 లక్షల మంది వచ్చినా ఏర్పాట్లు చేశామని డంకా బజాయించారు. కానీ ఏర్పాట్లలో ఘోర వైఫల్యంతో ఏపీ ప్రభుత్వం భక్తుల ఊసురుతీసింది. పోలీసులు, అధికారులు పట్టించుకోకపోవడంతో రాజమండ్రి తొక్కిసలాటలో 22 మంది మృత్యువాతపడ్డారు. ఇంకా పదుల సంఖ్యలో గాయాలపాలై అంపశయ్యపై ఉన్నారు.

కాగా తొక్కిసలాటలో సృహ తప్పిన భక్తులను ఆస్పత్రికి తరలించడంలో కూడా పోలీసులు, అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. వారిని సరైన సమయంలో తీసుకెళ్లి ఉంటే ప్రాణాలు దక్కేవి. కానీ గంటల తరబడి ఘాట్ లవద్దే నిర్లక్ష్యంగా పడేయడంతో  భక్తులు ఎక్కువ సంఖ్యలో మృతిచెందారు.

కాగా ఏర్పాట్లు ఘోరంగా ఉన్నాయని.. తమను ఎవరు పట్టించుకోవడం లేదంటూ భక్తలు మండిపడుతున్నారు. పుష్కరాల కోసం ఖర్చు చేసిన నిధులు నేతల జేబులు నింపడానికే ఖర్చయ్యాయని మండిపడ్డారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *