20 నుంచి వరంగల్ భద్రకాళి బ్రహ్మోత్సవాలు

వరంగల్ : వరంగల్లోని ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి కల్యాణబ్రహ్మోత్సవాలు ఈనెల 20 నుంచి నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్, ఈవో తెలిపారు. 20న గౌరీ గణపతి పూజ, పున్యవహచనాలతో అంకురార్పణ, 23న వైశాఖ శుద్ధమి పంచమి వేళ భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణోత్సవం, 24న సదస్యం, 25న చోరోత్సవం, 26న గంధోత్సవం నిర్వహిస్తామన్నారు. 27న భద్రకాళి భద్రేశ్వరుల రథోత్సవ వేడుకలు, 28న డోలోత్సవం, 29న వసంతోత్సవం నిర్వహించి 30వ తేదిన పుష్ప రథ సేవతో బ్రహ్మోత్సవాలను పరిసమాప్తం చేస్తామని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *