Breaking News

20 కోట్ల డాలర్లు ఇవ్వండి.. లేదంటే చంపేస్తాం..

article-2917804-24DC448200000578-2_634x355

సిరియా, ప్రతినిధి : సిరియాలో ఐఎస్ ఐఎస్ తీవ్రవాదులు ఇద్దరు జపానీయులను బంధించారు. 72 గంటల్లోగా 20 కోట్ల డాలర్లు చెల్లించకపోతే తమ నిర్బంధంలో ఉన్న జపాన్ దేశీయులను చంపుతామని వీడియో తీసి వెబ్ సైట్ లో పొందుపరిచారు. ఇందులో ఓ ఉగ్రవాది నల్లటి దుస్తులు ధరించి.. కత్తి పట్టుకొని బందీల మధ్య ఎడారి ప్రాంతంలో కెమెరా ముందు ఆంగ్లంలో మాట్లాడారు.  ఇద్దరు జపాన్ బందీలు నారింజ రంగుల దుస్తులు ధరించి ఉన్నారు.  ఇస్లామిక్ రాజ్యానికి వ్యతిరేకంగా దాడి చేస్తోన్న అమెరికా ఆధ్వర్యంలోని కూటమికి జపాన్ మద్దతివ్వడాన్ని విమర్శించాడు.

ఐఎస్ తీవ్రవాదద సంస్థ గత సంవత్సరం ఆగస్టు నుంచి పాశ్చాత్య దేశాలకు చెందిన అయిదుగురిని బందీలుగా తీసుకొని హత్య చేసింది. జపనీయులను నిర్బంధించి బెదిరించడం మాత్రం ఇదే మొదటిసారి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *