20న నిరసన ప్రదర్శన కు తరలిరండి: పొన్నం ప్రభాకర్

తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్ర్ర వ్యాప్తంగా కాంగ్రేస్ పార్టీ ఈ నెల 20వ తేదీన తలపెట్టిన నిరసన ప్రదర్శనకు ప్రజా ప్రతినిధులంతా తరలిరావాలని కరీంనగర్ మాజీ ఎం.పి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్ ఆర్ఎండ్ బి గెస్ట్ హౌస్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైతే ఈ ప్రాంతం బాగా
అభివృద్ధి అవుతుందని ప్రజలు భావించారని కాని దానికి విరుద్దంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని మన ఊరు మన ప్రణాళిక అన్న ప్రభుత్వం ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదన్నారు. జిల్లా పరిషత్ స్ధానిక సంస్ధలకు ప్రభుత్వం నిధులు ఇవ్వటం లేదని కాంగ్రేస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యులు భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేస్తే పోలీసులను జిల్లా పరిషత్ సభ హల్లోకి పిలిచి అరెస్ట్ చేయటం మంచి పద్దతి కాదని ఇది రాష్ట్ర్ర చరిత్రలోనే ప్రప్రధమని ఆయన అన్నారు. విద్యార్ధులకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని రైతు రుణాలను వెంటనే మాఫీ చేయాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కెసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన నిరసన ప్రదర్శన కి జెడ్పీటీసీ సభ్యులు, ఎంపిటిసి సభ్యులు, సర్పంచ్ లు, కార్పోరేటర్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, వివిధ అనుబంధ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలి రావాలని పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ అడ్లూరి లక్షణ్ కుమార్, ఆకుల ప్రకాష్, కర్రా రాజశేఖర్, ఒంటెల రత్నాకర్, బస్వరాజ్ శంకర్, పంజాల శంకరయ్య, పొన్నం సత్యం గౌడ్, ఉమాపతి, వెంకట రమణ, మధు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.