20న క్రైస్తవులకు విందు

remand

-అధికారికంగా క్రిస్ మస్ పండుగ
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం క్రిస్ మస్ పండుగను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది.. శుక్రవారం సచివాలంలో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని రెండు లక్షల మంది నిరుపేద క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేయాలని సీఎం నిర్ణయించారు. డిసెంబర్ 20న ఆదివారం ప్రార్థనల అనంతరం క్రైస్తవులకు క్రిస్ మస్ విందు భోజనం పెట్టాలని అధికారులను ఆదేశించారు.హైదరాబాద్ వంద చర్చిలలో , 95 నియోజకవర్గాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. మొత్తం 195 చోట్ల , ప్రతి దగ్గర 1000 మందికి చొప్పున ఫురుషులు, స్త్రీలకు దుస్తులు పంపిణీ చేయాలని కేసీఆర్ చెప్పారు.

అలాగే మైనారిటీ సంక్షేమం కోసం 60 గురుకుల పాఠశాలలను తెరవాలని నిర్ణయించినందున ఈనెల 20లోగా దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *