
– కనిపెట్టిన ఇజ్రాయిల్ శాస్త్ర వేత్తలు
ఢిల్లీ, ప్రతినిధి : స్మార్ట్ ఫోన్లు వచ్చాక చేతిలోనే ప్రపంచం ఇమిడిపోతోంది. క్షణం తీరిక లేకుండా దానితోనే గడిపేస్తున్నారు. గంటల గంటలు సెల్ చాటింగ్ తో చార్జింగ్ ఒక్కరోజు కూడా ఉండడం లేదు. బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువ టైం రావడం లేదని చాలా మంది కస్టమర్లు వేస్తున్న ప్రశ్న. స్మార్ట్ ఫోన్లలో స్మార్ట్ గా అప్లికేషన్లు డౌన్ లోడ్ చేస్తూనే ఉంటారు కస్టమర్లు. స్మార్ట్ యాప్ లు రన్ కావాలంటే ఛార్జింగ్ ఉండాల్సిందే. ఇక చార్జింగ్ కావాలంటే మినిమం అరగంటైనా సరే ఛార్జింగ్ పెట్టాలి. అదే రెండు నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ చేసే ఛార్జర్ వస్తే…వినడానికే చాలా బాగుంది కదూ! అలాంటిదే వచ్చింది.
2 నిమిషాల్లో ఫోన్లో ఫుల్ ఛార్జింగ్ అయ్యే కొత్త ఛార్జర్ ను తీసుకొచ్చింది ఇజ్రాయెల్ కు చెందిన స్టోర్ డాట్ కంపెనీ. దీంతో ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఐదు గంటల పాటు ఫోన్ ను వాడుకొవచ్చు. త్వరలోనే దీన్ని మార్కెట్ లోకి రిలీజ్ చేస్తామని కంపెనీ ప్రకటించింది.