
వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో పాటు జపాన్, కొరియా, తైవాన్ దేశాల్లో మన పారిశ్రామిక విధానాన్ని ప్రమోట్ చేసేందుకు సీఎం కేసీఆర్ ఒక సపరేట్ విమానాన్నే బుక్ చేశారు. దీనికోసం ప్రభుత్వం ఏకంగా 2 కోట్ల రూపాయలను విడుదల చేసింది..
సీఎం కేసీఆర్ ను ప్రపంచ ఎకనామిక్ ఫోరం ఆహ్వానించింది. చైనాలో జరుగునున్న ఈ సదస్సుకు కేసీఆర్ పాల్గొని తెలంగాణ పారిశ్రామిక విధానం, అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తారు.దాంతో పాటు జపాన్, కొరియా, తైవాన్ లలో పర్యటించి రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరిస్తారు. ఇందుకోసం ఏకంగా సపరేట్ విమానాన్ని బుక్ చేయించారు.
ఇందులో సీఎం కేసీఆర్ తన సతీమణిని తీసుకెళుతున్నారు. వీరితో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపార, ఫార్మా, ఐఎంఈ, పారిశ్రామిక రంగ నిపుణులను దాదాపు 25మందిని కేసీఆర్ వెంట తీసుకెళుతున్నారు. తెలంగాణ పెట్టుబడుల కోసం విదేశాల్లో ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.