19న హైదరాబాద్ లో TUWJ(IJU) తొలి మహాసభలు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీయూడబ్ల్యూజే తొలి మహాసభలు హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు టీయూడబ్ల్యూజే అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ తెలిపారు. బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

ఈ నెల19న మహాసభలు నాంపల్లి కళాతోరణంలో జరుగనున్నాయని.. ఈ మహాసభలకు 7 నుంచి 8 వేల మంది జర్నలిస్టులు తరలివస్తారని తెలిపారు. ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సభ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. అలాగే జర్నలిస్టుల సమస్యలపై కీలక తీర్మానాలు చేయనున్నట్లు వారు తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా ను వర్కింగ్ జర్నలిస్ట్ పరిధిలో కి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. గ్రామీణ, స్థానిక విలేకరులకు హెల్త్ కార్డులు, అక్రిడేషన్లు ఇళ్ల స్థలాల విషయంపై తీర్మానం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

ఈ మహాసభలకు కేంద్ర, రాష్ట్ర శాసనసభాపక్ష ప్రతిపక్ష నేతలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఐజేయూ నాయకులు కే. అమర్ నాథ్, ఫైనాన్స్ కమిటీ కన్వీనర్ వై నరేందర్ రెడ్డి, మీడియా కమిటీ కన్వీనర్ అయిలు రమేశ్, పబ్లిసిటీ కమిటీ కన్వీనర్ ఏ రాజేశ్, హెచ్.యూ.జే అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టి.కోటిరెడ్డి, వెలిచాల చంద్రశేఖర్, కోన సుధాకర్, యాదగిరి శంకర్ గౌడ్ లు హాజరయ్యారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *