
కరీంనగర్: మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన కేసుల్లో 18 మందికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ హుజూరాబాద్ ఫస్ట్ క్లాస్ జ్యూడిషియల్ మెజిస్ట్ర్రేట్ కంచె ప్రసాద్, రెండవ అదనపు జ్యూడిషియల్ మెజిస్ట్ర్రేట్ రాధికలు తీర్పునిచ్చారని కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లా మైలోని మండలం గర్మిళ్ళపల్లికి చెందిన మహ్మద్ రజాక్ నకు ఏడురోజులు జైలుశిక్ష, హన్మకొండకు చెందిన ఏల్పుల అనిల్ కుమార్, హసన్ పర్తికి చెందిన దాసరి నరేష్ లకు ఐదురోజుల జైలుశిక్ష, హుజూరాబాద్ కు చెందిన శంకరపల్లి శ్రీనివాస్, యం.డి రాజ్ మియా, జక్కుల రాజు, గాలి రమేష్, కొత్తకొండకు చెందిన మద్దెల ఎల్లగౌడ్, ఉప్పల్ కు చెందిన అమరకొండ శ్రీనివాస్, ఇప్పల నర్సింగాపూర్ నకు చెందిన బండి సమ్మయ్య, బొమ్మకల్ నకు చెందిన యం.డి రఫీలకు రెండు రోజుల జైలుశిక్ష విధించడం జరిగింది. మరో ఏడుగురికి జరిమానా విధించడం జరిగిందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపుతుండటం వల్లనే ఎక్కువశాతం మృత్యువాత పడుతున్నారని, ప్రమాదాలను నివారించేందుకు డ్రంక్ అండ్ డ్త్ర్రెవ్ లను కొనసాగించడం జరుగుతోందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారితో సాధారణ ప్రజలు, పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారని, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పట్టుబడిన సందర్భంలో కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ లను నిర్వహిస్తున్నామని, రెండవ సారి పట్టబడితే డ్త్ర్రెవింగ్ లైసెన్స్ రద్దుకు ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పారు. డ్రంక్ అండ్ డ్త్ర్రెవ్ లను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.