17 కోట్లతో నిర్మించనున్న మాతా శిశు ఆరోగ్య కేంద్రం

17 కోట్లతో నిర్మించనున్న మాతా శిశు ఆరోగ్య కేంద్రం

కామారెడ్డి జిల్లా బాన్స్ వాడ లో 100 పడకల మాతా శిశు  ఆరోగ్య కేంద్రానికి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేసిన వైద్య ఆరోగ్య, కుటుంబ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి

కామారెడ్డి ఏరియా హాస్పిటల్ లో 5 పడకల డియాలిసిస్ కేంద్రాన్ని  మంత్రి లక్ష్మారెడ్డి  ప్రారంభించారు

అనంతరం జరిగిన జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ లో జరిగిన బహిరంగ సభలో మంత్రులు మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ  కేసీఆర్ రాష్ట్రం, అన్ని వర్గాల ప్రజల గురించి ఆలోచిస్తున్నారన్నారు.  బంగారు తెలంగాణ, ఆరోగ్య తెలంగాణా సాధన దిశగా పని చేస్తున్నారని, అలాంటి సీఎం కి మనమంతా అండగా నిలవాలన్నారు.  విద్య, వైద్య రంగాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.  ప్రభుత్వ దవాఖానాలను ప్రైవేట్ హాస్పిటల్స్ కి దీటుగా తీర్చిదిద్దుతున్నామని,  పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ చేసుకోవాలని,  కేసీఆర్ పోరాటం, ఎందరో త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చింది అన్నారు.  దేశంలో తెలంగాణ తరహా అభివృద్ధి ఎక్కడా జరగడం లేదు, ప్రజాలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చారు, ఇవ్వని హామీలు, మ్యానిఫెస్టోలో చెప్పని అనేక అంశాలను అమలు చేస్తున్న ఘనత మన సీఎం గారిదే అని తెలియజేశారు. కేసీఆర్ లాంటి సీఎం ఉంటేనే మన రాష్ట్ర, మన ప్రజలు బాగుంటారన్నారు. బాన్స్ వాడ కు నవజాత శిశు కేంద్రాన్ని మంజూరు చేస్తామన్నారు.  సీఎం గారితో మాట్లాడి జుక్కల్ కి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని,  ఏడాది లోపే బాన్స్ వాడ  mch ని పూర్తి చేసి ప్రారంభిస్తామని చెప్పారు.

మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ  బాన్స్ వాడ లో డియాలిసిస్ కేంద్రాన్ని ప్రారంభించుకోవడం, మాతా శిశు కేంద్రానికి శంకుస్థాపన చేసుకోవడం శుభదాయకమని, విలువైన, అత్యవసరమైన డియాలిసిస్ కేంద్రం బాన్స్ వాడ లో ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడి డియాలిసిస్ బాధితుల సమస్యలు తీరుతాయన్నారు.  మాతా శిశు వైద్యశాలతో బాన్స్ వాడ తో పాటు ఎల్లారెడ్డి కామారెడ్డి, జుక్కల్, నారాయణఖేడ్ లాంటి పలు నియోజకవర్గ ప్రజలకు ఎంతో ఉపయోగమన్నారు.  ప్రత్యేకించి మహిళలకు, గర్భిణీలకు మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఎంతో ఉపయోగమన్నారు.  ప్రైవేట్ డాక్టర్లు కొందరు నరరూప రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు, కాసులకు కక్కుర్తి పడి పెదాలను పీడిస్తున్నారు మంత్రి లక్ష్మారెడ్డి గారు కామారెడ్డి కి 50 పడకలు ఇస్తే బాన్స్ వాడ కు ఇచ్చారు. ఇక్కడి సమస్యలు తెలిసిన డాక్టర్ గా ఆయన మనకు ఆప్తుడు ఇలాంటి సేవలు చేసే అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్  కి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ పేరుతో కేసీఆర్ కిట్ పేరుతో మంచి పథకాన్ని ప్రారంభించారు. గర్భిణీలకు కేసీఆర్ అందించిన వరం కేసీఆర్ కిట్ పథకం కేసీఆర్ కిట్స్ పథకం తీరు తెన్నులను వివరించారు. గర్భస్థ శిశువు నుంచి మరణాంతరం వరకు ప్రభుత్వ సేవలను వివరంగా చెప్పారు.

ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలతో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రాంతాలకు వైద్య సదుపాయాలు కల్పిస్తున్న వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి కి కృతజ్ఞతలు ఈ ప్రాంత వైద్య సమస్యలు తీర్చడానికి మరింత కృషి చేయాలి ప్రజలు ఇలాంటి వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి బాన్స్ వాడ కు icu ఇవ్వండి కేసీఆర్ కిట్ ని ప్రదర్శిస్తూ… ఒక్కో వస్తువుని ప్రజలకు చూపిస్తూ పథకాన్ని పోచారం వివరించారు

జుక్కల్ ఎమ్మెల్యే హనుమతు షిండే బాన్స్ వాడ హాస్పిటల్స్ అభివృద్ధి మాకు ఉపయోగకరంగా ఉంటుంది మా నియోజకవర్గంలో హాస్పిటల్స్ ను అప్గ్రేడ్ చేయాలి మీరు శంకుస్థాపన చేసిన హాస్పిటల్ ని త్వరలో ప్రారంభించాలి ఈ కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్ దఫెదార్ రాజు, శ్రీమతి పోచారం శ్రీనివాసరెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *