17న తమిళనాడు సీఎంగా జయలలిత ప్రమాణస్వీకారం

jayalalithaa_2162090g

బెంగళూరు: దాదాపు 2 దశాబ్దాలుగా అక్రమాస్తుల కేసులో విచారణ జరిగి చివరకు 4 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డ జయలలితకు కర్ణాటక హైకోర్టులో విముక్తి లభించింది. ఆమెకు కింది కోర్టు విధించిన నాలుగేళ్ల శిక్షను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ఆమెను నిర్దోషిగా విడుదల చేసింది.

నిర్ధోషిగా విడుదల కావడంతో తమిళనాడు సీఎంగా మళ్లీ ఎన్నికయ్యేందుకు ఆమెకు అవకాశం ఏర్పడింది. తీర్పు వెలువడిన వెంటనే తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం జయలలిత ఇంటికి వెళ్లారు. ఆయన రేపు రాజీనామా చేయనున్నారు. ఈ నెల 17 జయలలిత మళ్లీ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఎట్టకేలకు 231 రోజుల విరామమనంతరం జయలలిత తమిళనాడు సీఎం పీఠం మళ్లీ అధిష్టించనుండడంతో తమిళనాడులో పండుగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసిన జయలలిత గురించి సంబరాలు చేసుకుంటున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *