16 హెలికాప్టర్లు, 9హెలిప్యాడ్లు

గుంటూరు (పి ఎఫ్ ప్రతినిధి): నవ్యాంధ్ర రాజధాని నిర్మాణినికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 22న జరిగే నూతన రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించేందుకు 16 హెలికాప్టర్లతో పాటు 9 హెలిప్యాడ్లు ఏర్పాటు చేశారు. ఈ రాజధాని నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా రూ.50 కోట్ల వరకు వెచ్చించనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీతో పాటు కేంద్రమంత్రులు, వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, న్యాయమూర్తలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. ఇందు కొరకు ఇప్పటికే 250 ఎకరాలను రాజధాని శంకుస్థాపనకు సిద్ధం చేయాలని నిర్ణయించింది. తూళ్లూరు మండలంమ ఉద్ధండరాయుని పాలెంలో ఈ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. రాజధాని నిర్మాణ కార్యక్రమాన్ని ప్రపంచం మొత్తం వీక్షించేలా నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ కు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాలకు దాదాపుగా రూ. 60 కోట్లపైనే ఖర్చు చేయనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *