
-జూపల్లి, తుమ్మల, కొండా సురేఖకు బెర్తులు ఖాయం
-కొప్పులకు చీఫ్ విప్ పదవి
హైదరాబాద్, ప్రతినిధి : తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 16న ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగనుంది. ఈ మేరకు రాజ్‌భవన్‌కు సచివాలయం నుంచి సమాచారం అందింది. కేబినెట్‌లో జూపల్లి, తుమ్మలకు మంత్రి పదవులు ఖరారయ్యాయి. మహిళల కోటాలో వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కొండా సురేఖ, కోవాలక్ష్మికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది.
అలాగే తలసాని శ్రీనివాస్, ఇంద్రకరణ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ సచివాలయంలో బి, డి బ్లాకులను సీఎస్ రాజీవ్‌శర్మ, ఉన్నతాధికారులు పరిశీలించారు. కొత్త మంత్రులకు చాంబర్లు కేటాయించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కాగా ధర్మపురి ఎమ్మెల్యే కొప్పలు ఈశ్వర్ ప్రభుత్వ చీఫ్ విప్ గా ఎంపికయ్యారని సమాచారం.