15,16న టీఆర్ఎస్ జిల్లా శాఖ కార్యవర్గాల ఎన్నికలు

హైదరాబాద్ : ఈనెల 15, 16 తేదీల్లో టీఆర్ఎస్ జిల్లా శాఖ కార్యవర్గాల ఎన్నికలు నిర్వహిస్తున్నాని టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల ఇన్ చార్జి కృష్ణమూర్తి తెలిపారు. 15న ఆదిలాబాద్, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డిలో ఎన్నికలు, అనంతరం 16న మెదక్, నిజామాబాద్, హైదరాబాద్, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికీ గ్రామ కమిటీలు పూర్తి అయ్యాయని తెలిపారు. ఇప్పటికీ గ్రామ కమిటీలు పూర్తయ్యాయని తెలిపారు. త్వరలో నే డివిజన్ కమిటీలు కూడా పూర్తి అవుతాయని చెప్పారు.

కాగా ఆయా జిల్లాలకు ఎన్నికల అధికారులుగా మంత్రులను నియమించారు.
ఆదిలాబాద్ – పోచారం, కరీంనగర్ – హరీష్ రావు, నల్లగొండ – జూపల్లి కృష్ణరావు, ఖమ్మం-పద్మారావు, రంగారెడ్డి -నాయిని నర్సింహారెడ్డి , హైదరాబాద్ -మహేందర్ రెడ్డి, మహబూబ్ నగర్ -ఈటెల రాజేందర్ , నిజామాబాద్ -తుమ్మల నాగేశ్వర రావు, మెదక్ – ఇంద్రకరణ్ రెడ్డి, వరంగల్ – జగదీశ్ రెడ్డి నియమించినట్లు కృష్ణమూర్తి తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *