150 కోట్లతో వేములవాడ అభివృద్ది

తెలంగాణలోని అతిపెద్ద శైవ క్షేత్రంగా విలసిల్లుతున్న వేములవాడపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు.  ఇన్నాళ్లు యాదగిరి గుట్టపై దృష్టి సారించిన కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ పర్యాటక కారిడార్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు వేములవాడతో పాటు ధర్మపురి, కొండగట్టు, నాంపల్లి , ఎలగందుల ఖిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

ముందుగా కరీంనగర్ లోని వేములవాడ దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు 150కోట్లతో ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన త్వరలోనే వేములవాడలో పర్యటించనున్నట్లు సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *