Breaking News

150మంది బాలకార్మికులకు విముక్తి

Newswala-i-Hyderabad_Police_Cordon_Search_operation_Zehara_nagar_Banjara_Hills_Shair_Ali_Baig-Dq-1

హైదరాబాద్, ప్రతినిధి : ఒకరు కాదు.. ఇద్దరుకాదు ఏకంగా 150 మంది బాల కార్మికులు .. వీరంతా అన్నెం పున్నెం ఎరుగని బాలలు.. ఉత్తరప్రదేశ్, బీహార్ లకు చెందిన వీరిని నమ్మించి దళారులు పనికోసం తీసుకొచ్చి గొడ్డు చాకిరీలో వేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు.  సీటీ లోని బోరబండ, అంజయ్యనగర్ నగర్, కార్మికనగర్ ప్రాంతాల్లో సౌత్ జోన్ పరిధిలోని భవానీ నగర్ ప్రాంతంలో జరిపిన కార్డెన్ సెర్చ్ లో బాలలను ఎంతో అమానుషంగా బంధించి పనిచేస్తున్నారో వెల్లడైంది. సిటీలో ని ఖర్కానాల్లో పహెల్వాన్ల వద్ల పనిచేసేందుకు వీరిని హైదరాబాద్ కు తీసుకొచ్చి ఈ కుంపటిలో వేశారు

వెస్ట్ జోన్, సౌత్ జోన్ పరిధిలో శుక్రవారం అర్థరాత్రి 2 గంటల నుంచి 5 గంటల వరకు పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో 21 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 150 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. రౌడీ షీటర్ పటాన్ అలీఖాన్ ఇంట్లో రెండు నకిలీ తుపాకులు లభించాయి.  ఇతర ప్రాంతాల్లో ఆధారాలు లేని వాహనాలు, ఆటోలు, ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *