
హైదరాబాద్ : వరంగల్ -నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల ఓట్ల లెక్కింపు నిన్నటి నుంచి కొనసాగుతూనే ఉంది. తొలి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకపోవడంతో ఎన్నికల సిబ్బంది రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. 15వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి రాజేశ్వర్ రెడ్డి 12,332 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థికి 59764 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థికి 47041 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 13033 ఓట్లు లభించాయి. ఫలితం తేలాలంటే కావాల్సిన ఓట్ల సంఖ్య 66777 ఓట్లు . కానీ టీఆర్ఎస్ అభ్యర్థికి తక్కువగా ఓట్లు రావడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు. అప్పుడు కానీ విజయం ఎవరిని వరించిందో తెలుస్తుంది.