15వేలకు ఐఫోన్ తగ్గింపు

దాదాపు 50వేల పైనే ఉన్న యాపిల్ ఫోన్ల ధరలు తగ్గిపోతున్నాయట.. ఇన్నాళ్లు బాగా డబ్బున్న వాళ్లు మాత్రమే వాడే ఈ ఫోన్ ను మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు యాపిల్ కంపెనీ ప్రయత్నిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 5ఎస్ ధరను భారీగా తగ్గించి 15వేలకు అందుబాటులోకి తీసుకురావడాని కంపెనీ నిర్ణయించింది.

మార్చి 22న ఐఫోన్ ఎస్ ఈ మోడల్ ను యాపిల్ కంపెనీ విడుదల చేస్తోంది. ఈ సందర్బంగా ఐఫోన్ 5 ఎస్ ధరను 15వేలకు తగ్గించేందుకు నిర్ణయం తీసుకుందట.. మార్చి 22 తర్వాత మార్కెట్లో 5ఎస్ ఫోన్ 15వేలకు లభించనుందని సమాచారం. దీంతో యాపిల్ ఫోన్ మధ్యతరగతి ప్రజలకు సైతం అందుబాబులోకి రానుంది. ఇండియాలో ఈ ఫోన్లకు మరింత గిరాకీ పెరగనుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *