15లోగా టీయూడబ్ల్యూజే సభ్యత్వాలు పూర్తి చేయాలి..

కరీంనగర్ : తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే సభ్యులందరూ ఈనెల 15 తేదీలోగా తమ సభ్యత్వాలను రిన్యూవెల్ చేసుకోవాలని..టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు తాడూరి కరుణాకర్ కోరారు.  కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఆదివారం జరిగిన టీయూడబ్ల్యూజే కార్యవర్గ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత సభ్యులు సభ్యత్వ రిన్యువల్ తో పాటు కొత్తగా సంఘంలో సభ్యత్వం తీసుకునే వారు కూడా ఆయా ప్రెస్ క్లబ్ ల బాధ్యులకు సభ్యత్వం చెల్లించి కొత్త సభ్యులుగా చేరవచ్చని కరుణాకర్ చెప్పారు.. సభ్యులందరికీ కార్పొరేట్ లెవల్లో యూనియన్ ఐడీ కార్డులు జారీ చేస్తామని కరుణాకర్ తెలిపారు. పాత సభ్యులు 200, కొత్త సభ్యుల 250 రూపాయలు ఈనెల 15వ తేదీలోగా చెల్లించాలని ఆయన తెలిపారు. గడువు దాటిపోయినా మెట్ పల్లి,  జమ్మికుంట, సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు. టీయూడబ్ల్యూజే పోరాటం వల్ల జర్నలిస్టులకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని..జర్నలిస్టులకు హెల్త్ కార్డుల, డబుల్ బెడ్ రూం ఇళ్లు సకాలంలో వచ్చే విధంగా యూనియన్ కృషి చేస్తుందన్నారు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ సబ్ ఎడిటర్లతో సహా హెల్త్ కార్డులు, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని ఆయన కోరారు..  యూనియన్ ప్రతినిధులు కే.శ్రీనివాసరెడ్డి, దేవులపల్లి అమర్, ఎన్. శేఖర్, విరాహత్ అలీ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తానని ప్రకటించడం పట్ల జిల్లా కార్యవర్గం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిట్టల రాజేందర్, బల్మూరి విజయసింహారావు, తెలంగాణ ఆన్ లైన్  మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు , ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు అయిలు రమేశ్, టీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు భద్రాచలం, ఎలగందుల రవీందర్, లాయక్ పాషా, స్టేట్ కౌన్సిల్ సభ్యులు విశ్వనాథం, జగన్, ప్రభుదాసు, జిల్లా కోశాధికారి కాంబోజు మృత్యం,జిల్లా నాయకులు రంగారావు, నరేందర్, రవీంద్రచారి, మృత్యాల నర్సయ్య, రామేశ్వరరావు, దినేశ్, తిరుమల్ల మధు,  గాజుల నాగరాజు, గంగం రాజు , రాజు, కోటేశ్వరావు, నసిరోద్దిన్, రమణారావు, భాస్కర్, సత్తయ్య, వెల్గూటురు స్వామి, మృత్యుంజయం, తదితరులు పాల్గొన్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *